21 June, 2026 | 1:39 AM

వర్షకాలంలో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు

21-06-2026 12:00 AM

కూకట్ పల్లి, జూన్ 20,( విజయ క్రాంతి):వర్షాకాలంలో ప్రమాదాలను నివారించడంలో భాగంగా రోడ్ల పక్కన మ్యాన్ హోల్స్, ఓపెన్ నాళాలు, నీరు నిలిచే ప్రాం తాలను సులభంగా గుర్తించడానికి స్పష్టమైన ఎరుపు రంగు వేయాలని, బారికేడ్లను ఏర్పాటు చేయాలని కూకట్ పల్లి డిసి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు.

సైబ రాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని రోడ్డుపై వర్షపు నీరు నిలిచే ప్రాం తాలకు గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేస్తున్నామని కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని రోడ్ల మధ్యలో వర్షపు నీరు నిలిచి ఉండే పలు ప్రాంతాలను గుర్తించి అ ధికారులతో కలిసి అయన పరిశీలించారు. రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను వాహనదారులు, పాదాచారులు తప్ప ని సరిగా గమనించాలని అయన సూచించారు.