calender_icon.png 3 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకు అత్యధిక పరిహారం: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

03-12-2025 01:00:24 AM

  1. సింగరేణి మండలం బాజు మల్లాయి గూడెం, రేలకాయపల్లి గ్రామాలలో భూ సేకరణ 

పరిహారం నిర్దారణకు రైతులతో చర్చించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, డిసెంబర్ 02 (విజయ క్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి భూ సేకరణకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం ఇవ్వడానికి చర్యలు చేపట్టనున్న ట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సింగరేణి మండలం బాజు మల్లాయి గూడెం, రేలకాయలపల్లి గ్రామాలలో సీతారామ ఎత్తిపోతల పథకం నిమిత్తం భూ సేక రణ పరిహారం నిర్దారణ కు సంబంధిత రైతులతో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి, జిల్లా కలెక్టర్ చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మా ట్లాడుతూ సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రామాలలో సీతా రామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా భూ సేకరణ చేయాల్సి ఉండగా, భూ సర్వే నిర్వహించి అవార్డులు ప్రకటించామని, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించామని అన్నారు. ప్రాజెక్ట్ రావాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి, భూసేకరణ చేయాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

ప్రాజె క్టుతో సాగునీరు అంది, అక్కడి భూములు సారవంతం అవుతాయన్నారు. ఉన్నదాంట్లో మంచి రేటు ఇచ్చే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు.బాజుమల్లాయి గూడెం గ్రామంలో ఎకరానికి 2 లక్షల 70 వేల రూపాయలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం రెండింతలు అనగా 5 లక్షల 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్ర భుత్వం పెంచి 10 లక్షల 80 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించగా,

ఆర్బిట్రేషన్ లో 12 శాతం వడ్డీ క్రింద 64 వేల రూపాయలు కలిపి మొత్తం 11 లక్షల 44 వేలు ఎకరాకు చెల్లించనున్నట్లు తెలిపామని, అదేవిధంగా రేలకాయపల్లి గ్రామంలో ఎకరానికి 2 లక్షల 92 వేల రూపాయలు ఉందని, భూ సేకరణ చట్టం ప్రకారం రెండింతలు అనగా 5 లక్షల 85 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పెంచి 11 లక్షల 70 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించగా, ఆర్బిట్రేషన్ లో 12 శాతం వడ్డి క్రింద 70 వేల 390 వేల రూపాయలు కలిపి మొత్తం 12 లక్షల 40 వేల 390 రూపాయలు ఎకరాకు చెల్లించనున్నట్లు తెలిపామని, దీనికి రైతులు మరింత పెంచాలని కోరారని అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలో ఉన్న వ్యవసాయ పంపు సెట్ల, చెట్లు, సుబాబుల్ చెట్లు, ఇతర నిర్మాణాలకు సెపరేట్ గా పరిహారం అందిస్తా మని అన్నారు. కలెక్టర్ గా తనకున్న అధికారాలు, ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందజేయుటకు చర్యలు చేపట్టనున్నట్లు, భూ నిర్వాసిత రైతులందరూ అం గీకరించి, భూ సేకరణకు సహకరించాలని, ప్రభుత్వం నుండి పరిహారం త్వరితగతిన అందేలా చూస్తానని కలెక్టర్ అన్నారు.

సమావేశంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ తమ భూముల్లో సుబాబుల్ పంట వేశామ ని, పంట చేతికి వచ్చే సమయానికి, భూములను కోల్పోవడం వల్ల జీవనోపాధి కో ల్పోతున్నామని అన్నారు. సుబాబుల్ పంట జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు.

భూమి లో ఉన్న పైప్ లైన్, చెట్లు, ఇతర పరికరాలు, డ్రిప్ సిస్టం వివరాలు సరిగ్గా నమోదు చేసి పరిహారం అందించాలని అన్నారు. అందరికి ఒకేసారి పరిహారం అందేలా చూడాలన్నారు.ఈ సమావేశంలో ఎస్.డి.సి. ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ భూ సేకరణ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.