3 March, 2026 | 12:24 PM

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్‌లో హోలీ

03-03-2026 12:52 AM

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు హోలీ వేడుకలలో పాల్గొని తమ స్నేహితులు, ఉపాధ్యాయులకు రంగులను చల్లుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు పాల్గొని మాట్లాడుతూ..

హోలీ పండుగను కాముని దహనం అని కూడా అంటారని హోలి పండుగ దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి అంటూ ఈ పండుగ సత్యయుగం నాటి నుంచి జరుపుకుంటు న్నారంటూ వివరించారు.

డైరెక్టర్ కొండా కష్ణవేణి పాల్గొని, హోలీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యతలను, మన సంస్కతి సాంప్రదాయాలను తెలియజేస్తూ  విద్యార్థులందరూ ప్రకతి హితమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.