3 March, 2026 | 8:43 PM

బాన్సువాడలో ఘనంగ హోలీ సంబరాలు

03-03-2026 07:00 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా మండలాలు చందూర్ మోస్రా పొతంగల్ కోటగిరి రుద్రూర్ వర్ని నస్రుల్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి తమ తమ ప్రాంతాలలో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లలు యువతీ యువకులు మహిళలు పెద్దలు ఒకరిపై ఒకరు, రంగులను చల్లుకొని హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ, జాజిరి ఆటలు ఆడారు.

హోలీ పర్వదినంతో గ్రామాలు కాలనీలన్నీ రంగుల మయంగా మారి యువతి యువకుల్లో సందడి వాతావరణం నెలకొంది. నాయకులు ఒకరు ఒకరు రంగులు చల్లుకొని, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.  ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు.   కులమత బేధాలు లేకుండా జరుపుకునే ఈ హోలీ పండుగ వసంతకాలపు రాకను, ప్రేమ, ఐక్యత, సంతోషం, పాత గొడవలను మరచి కొత్త బంధాలను ఏర్పరచుకోవడాన్ని సూచిస్తుంది. నియోజకవర్గంలోని నాయకులు చిన్నారులు మహిళలు యువకులు యువకులు, పెద్దలు పాల్గొన్నారు.