3 March, 2026 | 8:29 PM

గాంధారి మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

03-03-2026 06:55 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కాముని దహనం, మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని గ్రామాల్లోని యువత ఆనందోత్సాహాల మధ్య రంగులు చల్లుకుంటూ, గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ నృత్యాలు చేస్తూ పండగ సంబరాలు జరుపుకున్నారు.

ప్రతీ సంవత్సరం లాగే సాయంత్రం స్థానిక దత్తాత్రేయ ఆలయం వద్ద కోలాటం ఆడుతూ జడకొప్పు వేయడం ఆద్యంతం అందరిని అలరించింది. నేడు వేసిన జాడకొప్పు మళ్ళీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాడు విప్పడం ఆనవాయితీ అని గ్రామ పెద్దలు తెలిపారు. తరాలు మారిన తమ గ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని వారు అన్నారు.