3 March, 2026 | 9:58 PM

ఘనంగా హోలీ పండుగ సంబరాలు

03-03-2026 08:04 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నల నుంచి పెద్దల వరకు రంగులు పూసుకుంటూ ఆనందంలో మునిగితేలారు. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విందులు, వినోదాల్లో మునిగితేలారు. ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డికి, సిఐ సత్యనారాయణగౌడ్ లకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రంగులు పూసి హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ గోనె లహరి ఆధ్వర్యంలో 15వ వార్డులో హోళీ సంబరాలు నిర్వహించారు. 19వ వార్డులో కౌన్సిలర్ దియా అగర్వాల్, విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. ఆయా వార్డు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపి శ్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు, విద్య హైస్కూల్ డైరెక్టర్ ప్రవీణ్ పవర్, రోటరీ క్లబ్ కార్యదర్శి ఖాందేశ్ సత్యం, మెడిసిటీ దామోదర్, గోనె శ్రీధర్, జాడే శ్రీనివాస్, మ్యాక శ్రీనివాస్, గంగుల సత్య వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.