08-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో పౌర్ణమి సందర్భంగా ఆదివారం హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. చండి మంత్రాలయంలో ఫియంబిక మాత సత్యముక్త స్వామీల ఆధ్వర్యంలో వైభవంగా యజ్ఞ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దత్తాత్రేయ ఆలయంలో దత్త స్వామి ఆధ్వర్యంలో హోమ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.