హోంగార్డు మరణం..ఎస్పీ సంతాపం
09-07-2026 01:23 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూ బాబాద్) జూలై 8 (విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన హోం గార్డు శ్రీనివాస్ మృతదేహానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు.






