calender_icon.png 2 December, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంగార్డ్స్ సమస్యలను పరిష్కరించాలి

02-12-2025 02:03:27 PM

ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు

హన్మకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డ్స్  ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2016 నుండి హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని, ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 6ని హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గతంలో హోంగార్డ్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంగార్డ్స్ కి ఇచ్చిన అనేక హామీలు ఇంతవరకు పరిష్కారం కాలేదనీ, ప్రస్తుత ముఖ్యమంత్రి హోదాలో హోంగార్డ్స్ కి  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

సాధారణ పరిస్థితులలో, అత్యవసర పరిస్థితులలో, సాధారణ పోలీసుల లాగే విధులు నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14,500 మంది హోంగార్డ్స్ కి హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయడంతో పాటు హోంగార్డ్స్ వ్యవస్థలో కూడా కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కి ఒక హోంగార్డు ని ఏకగ్రీవంగా సర్పంచ్ గా గెలిపించిన స్ఫూర్తితోనే హోంగార్డ్స్ యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.