calender_icon.png 2 December, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకో రన్నింగ్ ఉద్యోగులు నిరాహార దీక్ష

02-12-2025 02:00:41 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐఎల్ఆర్ఎస్ ఆధ్వర్యంలో లోకో రన్నింగ్ ఉద్యోగులు మంగళవారం సామూహిక నిరసన దీక్ష చేశారు. రన్నింగ్ సిబ్బంది పని గంటలు తగ్గించాలని, ఇవ్వాలని వారాంతపు విశ్రాంతి ఇవ్వాలని, బయట స్టేషన్ విశ్రాంతి (8+2) గంటలు అమలు చేయాలని, హెడ్ క్వార్టర్ విశ్రాంతి ( 16+2) గంటలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాప్ అసోసియేషన్ (ఏఐఎల్ఆర్ ఎస్ ఏ)  బ్రాంచ్ కార్యదర్శి రవీంద్రర్ రామ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిలు ఏకే మోరే, నాగేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.