02-12-2025 02:06:01 PM
ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నుకున్న సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని దామన్న నివాసములో కార్యకర్తలతో కలిసి సర్పంచులను వార్డు మెంబర్లను ఎన్నుకోవటానికి కృషి చేసి, మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నేడు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలవన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ఎన్నిక కోసం కార్యకర్తలు నాయకులు ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. నాగారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చిప్పలపల్లి మధును బలపరుస్తున్నట్లు తెలిపారు.