06-12-2025 10:18:31 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హోంగార్డుల రైజింగ్ డే ను ఘనంగా నిర్వహించారు. ఉదయం పరేడ్‌తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోంగార్డులు పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ గౌరవ వందనం సమర్పించారు. నేరాల నియంత్రణ, లా అండ్ ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు స్పందన, అత్యవసర సేవల్లో ప్రతిభ కనబరిచిన వారికి కమిషనర్ విజయ్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం హోంగార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కమిషనరేట్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మమత హాస్పిటల్, కేర్ హాస్పిటల్స్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. ఈ వేడుకల్లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అడిషనల్ డీసీపీ(ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఆర్ఐలు కార్తీక్, ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, భరత్ భూషణ్, ఎస్ఐలు పుష్ప, నిరంజన్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.