06-12-2025 10:14:17 PM
మునిపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా మండలంలోని ఖమ్మంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిస్ర్ ర్ ఫౌండేషన్ చైర్మన్ పైతారా సాయికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పైతారా సాయికుమార్ మాట్లాడుతూ బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దృష్టి లేకపోతే నేటి ప్రజాస్వామ్యానికి ఉన్న బలమైన పునాదులు ఏర్పడేవి కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య–ఉపాధుల్లో హక్కులు వంటి విలువలను ఆయన భారతదేశ ఆత్మలో నాటారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం అంబేద్కర్ చూపిన మార్గానికే అనుసరణ తెలిపారు. పేద, వెనుకబడిన, అణగారిన వర్గాల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత వేగవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉపపసర్పంచ్ తుడుం సుభాష్, గాండ్ల నరేష్, కలల ఆంజనేయులు, తుడుం రాజేందర్, తుడుం రాజు పాల్గొన్నారు.