06-12-2025 10:21:46 PM
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
చిగురుమామిడి (విజయక్రాంతి): మండలంలోని కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తోడేటి శ్రీనివాస్, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు శనిగరం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
అనంతరం తోడేటి శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రామ శాఖ అధ్యక్షుడిగా తనకు కనీస గుర్తింపు లేకుండా చేశారని, దీంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. గ్రామ అభివృద్దె లక్ష్యంగా, ప్రజాసేవే ధ్యేయంగా ఒక కొత్త ఆశయంతో ముందుకు వస్తున్న యువకుడు కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థి మార్క రాజ్ కుమార్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తోడేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.