22ఏ నిషేధిత జాబితా నుంచి పేదల ఇండ్లను తొలగించాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య
సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 21: కొన్ని దశాబ్దాల కాలంగా నివాసముంటున్న ఇండ్లు, సేద్యం చేసుకుంటున్న భూములను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చి పేద ప్రజల పొట్టకొడుతుంటే చూస్తూ ఊరుకోమని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం.
కొనసాగుతుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య అన్నారు.శుక్రవారం నారాయణపురం మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో 22A నిషేధిత జాబితాలో పేద ల ఇండ్లు భూములను చేర్చినందుకు గాను ఎమ్మార్వో కార్యాలయం వద్ద గ్రామస్తులతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
పేదల భూ ములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిప త్రం అందజేశారు.అనంతరం గాలయ్య మా ట్లాడుతూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకో దని 22A ద్వారా నిషేధిత జాబితాలో చేర్చిన ఇండ్లు భూములను వెంటనే తొలగించాలని లేని యెడల ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్దె శ్రీనివా స్, సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భా స్కర్, చిలువేరు అంజయ్య, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, సింగపంగ మల్లయ్య, గడ్డం యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.






