22 August, 2026 | 1:27 AM

సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం

22-08-2026 12:50 AM

రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పటాన్ చెరు, ఆగస్టు 21: ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాశం మైలారం, చిట్కుల్ వార్డుల్లో సుమారు రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, గాయత్రి పాండు, కౌన్సిలర్లు పాండు, సంధ్య నవీన్ రెడ్డి, లత వెంకటేష్, రాజు, ఆంజనేయులు, వెంకటేష్, అరుణ్, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బాబా, అసీయ బేగం, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, కృష్ణ, రాజు, బండ రాజు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.