14 July, 2026 | 4:53 AM

మోటార్ సైక్లింగ్ అనుభవాన్ని చేరువచేస్తాం

14-07-2026 12:37 AM

ఎర్రగడ్డలో హోండా ప్రీమియం షోరూం ప్రారంభం

జూబ్లీహిల్స్, జూలై 13 (విజయక్రాంతి): ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ ఎర్రగడ్డలో కొత్త ప్రీమియం షోరూమ్ ఏర్పాటు చేసింది. షోరూం ప్రారంభోత్సవాన్ని సోమవారం నిర్వహించింది. ఈ ప్రారంభోత్సవానికి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ మేనేజర్ టికేంద్ర ప్రతాప్ సింగ్, ఏరియా సర్వీస్ ఇంచార్జి హరీశ్ హవాజీ ముఖ్య ఆహ్వానితులుగా హాజరై షోరూంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా సంస్థకు చెందిన ప్రీమియం బైక్ మోడళ్లు నగరవాసులకు కొత్త షోరూం ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరవాసులకు ప్రీమియం మోటార్ సైక్లింగ్ అనుభవాన్ని మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అత్యుత్తమ విక్రయాలు, సేవలు, అమ్మకాల సేవలను అందిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నెట్వర్క్ విస్తరిస్తున్నామని తెలిపారు. ఫార్చ్యూన్ హోండా ప్రతినిధి మాట్లాడుతూ కొత్త షోరూంలో ఆధునిక సర్వీస్ వర్క్ షాప్, అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు, టెస్ట్ రైడ్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ హోండా బిగ్వింగ్ డైరెక్టర్లు నిరవ్ మోదీ, ఆశిష్ మోదీ, సీఈఓ పీటర్ పాల్, సీఎఫ్‌ఓ రవి ప్రకాశ్, జోనల్ మేనేజర్ (సర్వీస్) ఆశిష్ కుమార్ మిశ్రా, బిగ్వింగ్ సేల్స్ మేనేజర్ మొయిజ్ బషీరుద్దీన్, సర్వీస్ మేనేజర్ జగదీష్ బాబుతో పాటు ఇతర అధికారులు, వినియోగదారులు, ద్విచక్ర వాహన ప్రియులు పాల్గొన్నారు.