14 July, 2026 | 4:49 AM

ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఒక యుద్దం లాంటింది

14-07-2026 12:39 AM
  1. తెలంగాణ సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల గద్దర్
  2. బిఎల్‌ఏలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసిన జగ్గారెడ్డి, నిర్మల 

సంగారెడ్డి, జూలై 13 :ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఒక యుద్దం లాంటిదని, దీన్ని ఎదుర్కునేందుకు ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లాగా పోరాడాలని తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఏ , ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమగ్ర సవరణ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

బిఎల్వోలు మీ దగ్గరకు రాకున్నా మీరే వెళ్లాలని బిఎల్‌ఏ లు, నాయకులకు సూచించారు. ఓట్ నమోదు కాకపోతే వ్యక్తిగతంగా ఓటర్ కే నష్టం కాబట్టి ఓటర్ లు కూడా తమ ఓటహక్కును నమోదు చేసుకోవాలనే ఆతృత, ఆసక్తి ఉండాలన్నారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రానున్న ఐదురోజుల్లోనే సర్ ప్రక్రియ పూర్తి అయ్యేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ పని మనది, మన సంగారెడ్డి కో సం పని చేస్తున్నామనే విషయాన్ని దృష్టి లో పెట్టుకుని పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ లు కూన వనితా సంతోష్, అంజ మ్మ సత్యనారాయణ, నాయకులు కూన సంతోష్, షఫీ హఫీజ్,  కిరణ్ గౌడ్, రఘు గౌడ్, జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.