మోడల్ పాఠశాలలో విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ
నాగలిగిద్ద, జూలై 13:నాగలిగిద్ద మండలం మొర్గి తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలలో సోమవారం విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అపెక్స్ ఆసుపత్రి, సంగారెడ్డికి చెందిన సునీల్ కుమార్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నాగలిగిద్ద ఎస్త్స్ర రామకృష్ణ విద్యార్థులకు బాటిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అపెక్స్ ఆసుపత్రి ప్రతినిధి సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను జ న్మించిన గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేసే అవకాశం ల భించడం గర్వకారణమని పేర్కొన్నారు.
విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.అనంతరం మొర్గి, గోడెగాం, షాపూర్ పాఠ శాలల విద్యార్థులకు కూడా స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణ, మొర్గి సర్పంచ్ అన్నపూర్ణశివశరణప్ప, మాజీ ఎంపీటీసీ శంకరయ్య స్వామి, గున్న సంగమేశ్వర్ గుప్త, చిలప్చేడ్ ఎంఈఓ విట్టల్, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.






