calender_icon.png 3 December, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సలహాదారుకు సన్మానం

03-12-2025 05:27:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి బుధవారం జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి నిర్మల్ జిల్లా మైనారిటీ నాయకులు, తదితరులు సన్మానం చేశారు. డిసెంబర్ 4న ఆదిలాబాద్ లో జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు నిర్మల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునది మెమన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నూ,మైనారిటీ పట్టణ అధ్యక్షులు మతీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ నిర్మల్ నియోజకవర్గ యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అర్షద్, అల్తాఫ్ అహ్మద్ కీజర్, నవీద్ తదితరులున్నారు..