calender_icon.png 3 December, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల బకాయిలు చెల్లించాలని సుదర్శన్ రెడ్డికి వినతి

03-12-2025 05:19:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావుతో కలిసి బుధవారం జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ. 20 కోట్లు బకాయి చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. స్పందించిన సుదర్శన్ రెడ్డి సీఎం పేషిలో మాట్లాడి రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తానని హామీ  ఇచ్చారు