‘25 ఏళ్ల సేవ’కు సత్కారం
శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించిన హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ అనగానే అందరికీ గుర్తు కొచ్చే పేరు కేసీఆర్.. తెలంగాణ భవన్ అంటే గుర్తుకొచ్చేది శ్రీనివాస్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయనను హరీశ్‌రావు సన్మానించి మాట్లాడారు. జలదృశ్యం, తెలంగాణ భవన్, కేసీఆర్ పార్టీ పెట్టిన మూడో రోజు నుంచి ఇప్పటివరకు (25 ఏళ్లు) ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు.
శ్రీనివాస్‌రెడ్డిలో ఇంతవరకూ కోపం చూడలేదన్నారు. 1969లో వెటర్నరీ కాలేజీ అధ్యక్షుడుగా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్రం కోసం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీని వాస్‌రెడ్డి తయారుచేసిన బీ ఫామ్‌ల మీద కేసీఆర్ సంతకం పెట్టే వారని గుర్తు చేసుకు న్నారు. ఇప్పుడు ఆయన వెళ్తుంటే కేసీఆర్ చాలా బాధపడ్డారని.. అందుకే సన్మానం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.






