నిజామాబాద్‌లో విజయోత్సవాలు
నిజామాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రజాపాలన - ప్రజా విజ యోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరోగ్య ఉత్సవాలు నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
నియోజక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివప్రసాద్ పాల్గొన్నారు.






