గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామ పంచాయితీ సిబ్బందిని ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ శాలువతో ఘనంగా సన్మానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించడంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేసే కృషే అనిర్వచనీయమన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, పారిశుద్ధ్యం పెంపొందలన్నా పంచాయతీ సిబ్బంది నిర్వర్తించే విధులే ప్రధాన కారణమని గ్రామానికి వారు చేసే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లీ భవాని, పంచాయతీ కార్యదర్శి వలిగొండ పరమేష్, వార్డు మెంబర్లు నర్రా రాములమ్మ, అంగన్వాడి టీచర్లు అరుణ, ఇంద్ర, ఆశ వర్కర్లు నాగరాణి, రజిత, గ్రామ ప్రముఖులు మేడి శ్రీను, దూదిగామ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






