24 April, 2026 | 9:25 PM

గుత్తా అమిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ప్రత్యేక పూజలు

24-04-2026 08:08 PM

గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రసాదం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

చిట్యాల,(విజయక్రాంతి): గుత్తా అమిత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని కోరుతూ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి ప్రసాదాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ పాకాల దినేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు కలిసి మండలి చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకొని, గుత్తా అమిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, జన్నపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.