02-05-2025 10:58:50 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శుక్రవారం జమా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళుతున్న షేక్.మీరా సాహెబ్, షేక్. సైదులు లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ హజ్ యాత్రలో పాల్గొనబోయే వారిని పవిత్ర మక్కాలో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జమా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఫయాజుల్ హస్సన్, కార్యదర్శి ఇబ్రహీం ఖురేషి,ఖాజా అహ్మద్,అక్బర్, మస్తాన్ ఖురేషి,ఫక్రుద్దీన్,రహీమ్, ఫారూఖ్ ,హన్ను ,మత గురువులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.