2 July, 2026 | 12:35 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

02-05-2025 10:57 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ లో దామరంచ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు సయ్యద్ ఇగ్బాల్ కుమారుని  వివాహ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లి వస్తుండగా బిచ్కుంద మార్గమధ్యంలో అయ్యప్ప గుడి వద్ద సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ కలిశారు. బిచ్కుంద దాటి వస్తున్నాడని తెలుసుకొని రవీందర్ రెడ్డిని కలిసి వారిని ఆశీర్వదించారు. అనంతరం ఏనుగు రవీందర్ రెడ్డి   సద్గురు సోమలింగ శివాచార్య మ హారాజు ను ఘనంగా (పట్టుశాలువాతో )సన్మానిం చారు.శ్రీ సద్గురు సోమలింగ శివాచార్యమహారాజు  మాట్లాడుతూ బిచ్కుందమఠానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

స్వయంభు బోర్లంఆది బసవేశ్వర ఆలయాన్ని సందర్శించాలనికోరారు. రవీందర్ రెడ్డి స్పందిస్తూ తప్పకుండా బిచ్కుంద మఠాన్ని బోర్లoస్వయంభు ఆది బసవేశ్వర ఆలయాన్ని త్వరలోనే సందర్శిస్తానని అప్ప తో తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వగణేష్,  కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులుపెద్ద పట్లోలదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్మరి నర్సింలు,  పోతురాజు లింగం, మాజీ వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల సాయిలు, సయ్యద్ మంజూరు (మైనార్టీ యూత్ లీడర్ )ఇబ్రహీంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి పెద్ద సాయిలు, బాన్సువాడనియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.