5 April, 2026 | 8:05 PM

మైత్రి వెంకటరెడ్డి సేవలు మరువలేనివి

05-04-2026 02:25 PM

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సాంబశివరెడ్డి    

మంగపేట,(విజయక్రాంతి): మైత్రి వెంకటరెడ్డి సేవలు మరువలేనివని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన సానికొమ్ము వెంకటరెడ్డి (మైత్రి వెంకటరెడ్డి)ని ఆదివారం ములుగు జిల్లా సరిహద్దు గ్రామమైన మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ మైత్రి వెంకటరెడ్డి ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి జీవనోపాధి కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెంకట్ రెడ్డి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవి రావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫర్టిలైజర్ డీలర్లు కన్నెగంటి దుర్గాప్రసాద్, గాదంశెట్టి సుబ్రహ్మణ్యం,  దాట్ల శ్రీనివాసరాజు, గోపి, పచ్చిపులుసు నరేష్, బండారి రాంబాబు, గంటా రవీందర్ రెడ్డి, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.                                               ...... ఎండ్ ......