5 April, 2026 | 8:22 PM

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న భీమిరెడ్డి

05-04-2026 02:32 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం కోక్యాతండా గ్రామంలో వడిత్య మోహన్--సునీత దంపతులు  నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి  కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నూతన గృహాలలో అడుగుపెట్టిన లబ్ధిదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడం మంత్రి ముఖ్య లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అనేక మంది కుటుంబాలు ఆనందంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ఇంటి అనేది ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, సంతోషానికి ప్రతీక అని పేర్కొంటూ, ఈ పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ఈ కార్యక్రమంలో సర్పంచ్ హాలావత్ వీరయ్య, స్థానిక నాయకులు సైదులు, చందర్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.