18-09-2025 06:36:25 PM
ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన బిజెపి నాయకులు
తాండూరు (విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని తద్వారా ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించుకోవచ్చు అన్న మహాత్మా గాంధీ కలలు కన్నా భరతావనిని తయారు చేసుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ అన్నారు. గురువారం ఆయన బిజెపి నాయకులతో కలిసి పట్టణ శివారులో ఉన్న ప్రముఖ రసూల్ పూర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ వరకు నియోజకవర్గంలో స్వచ్ఛ తాండూర్ తో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, నరేందర్ రెడ్డి, సాయిరెడ్డి, దేవనూరు ఆకుల శివ, రమ్యనాయక్ sc మోర్చా అధ్యక్షులు మ్యాతారి లలయ్య తదితరులు పాల్గొన్నారు. శివారులో ఉన్న ప్రముఖ రసూల్ పూర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ వరకు తాండూర్ నియోజకవర్గంలో స్వచ్ఛ తాండూర్ తో పాటు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.