15 April, 2026 | 3:00 AM

అన్నదాతకు సన్మానం

03-01-2026 06:36 PM

వెల్గటూర్,(విజయక్రాంతి): మండలకేంద్రంలోని శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా నోముల జలజ వెంకట రెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం నిర్వహించిన జలజ వెంకట రెడ్డిలను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్, సన్మానించి స్వామివారి చిత్ర పటాన్ని అందించారు.