03-01-2026 06:32:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా సర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాలోని ఉపాధ్యాయులు అందరికీ పదివేల చొప్పున రెమనరేషన్ చెల్లింపులు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ ఫైజానమ్మద్ కి వినతిపత్రం అందించారు.
మిగతా జిల్లాల్లో ఒక్కొక్క ఉపాధ్యాయునికి పదివేల చొప్పున ఇవ్వడం జరిగింది సంవత్సరకాలం గడుస్తున్న ఉపాధ్యాయులకు రావలసిన గౌరవ అమౌంటు విషయంలో ఆలస్యమైనదని వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి ఉపాధ్యాయ ఇలా ఖాతాలో వారి సర్వే సర్వే డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.