14-10-2025 12:56:53 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలానికి(Kothapalli Mandal) నూతన వ్యవసాయ అధికారిగా వచ్చిన కోట సంతోష్ కుమార్ కు కొత్తపల్లి పట్టణ రైతులు, రైతు వేదిక వద్ద స్వాగతం తెలియజేస్తూ, సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఎఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు ఎప్పడు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు బండ కిషన్ రెడ్డి, చిట్కూకూరి శ్రీనివాస్, కోదాటి శంకర్, ఎడ్ల రాములు, కూర జనార్దన్ రెడ్డి, గుడిపాక కుమార్, కలకొండ మనోహర్ రెడ్డి, చింతల సత్యనారాయణ రెడ్డి, సత్యానందం, అంకాల హనమండ్లు, కొదటి సత్యం తదితర రైతు సోదరులు పాల్గొన్నారు.