14-10-2025 12:53:03 PM
దౌల్తాబాద్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జనగామ దయాకర్ (21) ఆదివారం తన పొలం వద్ద పని చేస్తుండగా పాముకాటుకు(snakebite) గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దయాకర్ మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.