టూరిజం కారిడార్‌పై చిగురిస్తున్న ఆశలు
ముఖ్యమంత్రి ఆదేశాలతో జరగనున్న అభివృద్ధి
సంతోషం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు
నిర్మల్ మే 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మరో జమ్మూ కాశ్మీర్ గా పిలువబడి ఉమ్మడి అదిలాబాద్ పర్యాటక అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రజాపాలన ప్రభు త్వం ఉమ్మడి జిల్లా అభివృద్ధి విషయంలో పదేపదే తాను దత్తత తీసుకొని ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసింది. తాజాగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం కారిడార్గ అభివృద్ధికి సత్వరం చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించడంతో టూరిజం అభివృద్ధిపై హర్షం వ్యక్తం వ్యక్తం అవుతుంది. నిర్మల్ అదిలాబాద్ జిల్లాలో ప్రాచీన కట్టడాలు దేవాలయాలు, చరిత్ర టూరిజం అభివృద్ధి నోచుకోనున్నాయి
అభివృద్ధికి ఎన్నో అవకాశాలు
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల జిల్లా ఆదివాసీల జిల్లా గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టిన రా ష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికీ అదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేయ గా తాజాగా బాసర కడెం నాగోబా కేంద్రాలుగా ప్రత్యేక టూరిజం కారిడార్గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కడెం మండల కేంద్రంలో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గిరిజనులు ఆరాధ దైవంగా కొలిసే నాగోబా ఆలయం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందితే ఆ ప్రభావం ఈ ప్రాంతంలో మిగతా పర్యాటక ప్రాంతాలపై కూడా పడనుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
ఈ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలోనే ప్రారంభించారు. ఈ ఆలయం అ భివృద్ధి చెందే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల భక్తులకు ఎంతో సౌకర్యం ఉంటుంది. బాసర రైల్వే లైన్ డబ్బులు లైన్ గా మార్చారు. ఇక నిర్మల్ పట్టణ విషయానికి వస్తే 400 ఏళ్ల నాటి చరిత్ర గల నిమ్మల కోటలు బురుజులు గొలుసుకట్టు చెరువులు సోన్ బ్రిడ్జి, మహబూబ్ ఘాట్, నిర్మల్ కొయ్య బొమ్మలు, గుట్టలు ప్రాచీన దేవాలయాలు జిల్లాలో ఉన్నాయి. ఇందులో కదిలి పాప అన్నపూర్ణ ఆలయంతో పాటు కాలువ నరసింహస్వామి ఆలయం ఉంది.
ఇకక్కడం ప్రాజెక్టు టూరి జం గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా అదిలాబాద్ మార్గాల్లో మహబూబ్ కాట్ సయాద్రి పర్వతాలు ఇంద్రవెల్లి మండలం నాగోబా ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి పొందిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, వంటి పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కడెం ప్రాజెక్టు నాగోబా ఆలయాలు పర్యాటక రంగ అభివృద్ధిపై ఇప్పటికి ప్రత్యేక కార్యచరణ యాక్షన్ ప్లాన్ డి పి ఆర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. దీనికి తోడు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించడంతో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం తో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడుతుందని పర్యాటకులు పేర్కొంటున్నారు. అయితే పర్యాటక కారిడార్ పనులను త్వరగా ప్రారంభించి పనులు పూర్తి వరకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని నిర్మల్ అదిలాబాద్ ప్రజలు కోరుతున్నారు .
పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు
నిర్మల్ అదిలాబాద్ జిల్లాలో బాసర సరస్వతి ఆలయంతో పాటు కడెం ప్రాజెక్టు నాగోబా ఆలయ కలుపుకొని పర్యాటక కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ కు ఎంతో ప్రాధాన్యత పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటకంగా కావలసిన చర్యలను ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే పర్యాకుటకుల సంఖ్య పెరిగి పర్యాటక ఆదాయం కూడా జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.






