02-05-2025 10:23:26 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ రామానుజ చార్యుల విగ్రహానికి 1008 వ జయంతి సందర్భంగా స్వామి వారికి. ఘనంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ పూజా కార్యక్రమంలో పాల్గొని. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. తమ ఇంటిపేరు వేమూరి వారి. కులదైవం శ్రీ రామానుజాచార్యుల స్వామి వారి 1 008 వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతమును ప్రసాదించిన గొప్ప తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ యోగి అని త్రి మతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటిలేని భక్తికి రామానుజాచార్యుల వారి జీవితం ఆదర్శమని ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న . ఆచార వ్యవహారాలు చాందసంగా మారి సామాజిక పురోగతి కి .అడ్డరాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో .మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రదమ కర్తవ్యం అని ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు తమకు కీడు జరిగిన . పదిమందికి జరిగే మేలు కై .తమ కీడును లెక్క చేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తి గత శ్రేయస్సు కాదు అని సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం. పరితపించిన. గొప్ప ఆధ్యాత్మిక వేత్త మానవాళికి గొప్ప ఆదర్శ మూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో నిర్వహించి. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలోనరసింహా పురం గ్రామం తో పాటు వివిధ గ్రామాల కు చెందిన భక్తులు పాల్గొన్నారు.