calender_icon.png 13 July, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో భయానక పరిస్థితులు

06-12-2024 01:24:48 AM

  1. కౌశిక్‌రెడ్డిపై కేసు హాస్యాస్పదం
  2. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాం తి): రాష్ర్టంలో భయానక పరిస్థితిలు నెలకొన్నాయని.. రాజ్యాంగ హక్కులను కాపాడా ల్సిన పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొమ్ముకాస్తున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ భ వన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ప్రాణాపాయం ఉందని, తమ నా యకుల ఫోన్లతో పాటు మంత్రి ఉత్తమ్, ఇత ర నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు.

ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ సీఎం కావడం రాష్ర్ట ప్రజల దురదృష్టమన్నారు. కేటీఆర్‌తో పాటు, ప్రజల పక్షాన పోరాడుతున్న హరీశ్‌రావుపై అక్రమ కేసులు పెడుతున్నారని విరుచుకపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనపై ని రాదార ఆరోపణలు చేసిన కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, సుజాతలకు ప్రవీణ్‌కుమార్ లీగల్ నోటీసులు పంపారు.