calender_icon.png 14 July, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జాగృతి’తో జనాల్లోకి

06-12-2024 01:24:11 AM

  1. * జిల్లాలవారీగా ఎమ్మెల్సీ కవిత సమావేశాలు
  2. * హైదరాబాద్‌లోని నివాస కేంద్రంగానే..

నిజామాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాల వారీగి జాగృతి సమావేశాలు నిర్వహించి, మళ్లీ జనాల్లోకి వెళ్లేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే జిల్లాల పర్యటన తేదీలను ప్రకటించిన కవిత.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలోనే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. పరిస్థితులు చక్కబడే వరకు హైదరాబాద్ వదిలి వెళ్లొద్దని కేసీఆర్.. ఆమెను ఆదే శించడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు డిసెంబర్ 4న కవిత నిజామబాద్ పర్యటన ఉంటుందని రాజకీయ వర్గాలు భావిం చాయి. కానీ జిల్లాలోని జాగృతి కమిటీలను తన ఇంటివద్దకే రప్పించుకుని సమావేశాలు నిర్వహించారు. అయితే గతంలో కవితను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీలు, ఎమ్మెల్యే లు పడిగాపులు కాసేవారు. ప్రస్తుతం జాగృతి కార్యకర్తలు కవిత ఇంటికి వెళ్లి, సమావేశంలో పాల్గొంటున్నారు.