28 May, 2026 | 7:10 PM

గాలివానకు కూలిన ఇంటి పైకప్పు

28-05-2026 06:07 PM

మఠంపల్లి మే 28(విజయ క్రాంతి): మండలంలోని లాలి తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. గ్రామానికి చెందిన తాళ్లూరి వీర బ్రహ్మచారి నివాస గృహం పై ఉన్న రేకుల కప్పు ఒక్కసారిగా బలమైన గాలులకు తట్టుకోలేక పూర్తిగా ఎగిరిపడి పక్కనే కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ వారు స్వల్ప గాయాలతో బయటపడగా, పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇంటి సామగ్రి, గృహోపకరణాలు, రేకులు పూర్తిగా దెబ్బతిని భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు తెలిపారు.ఘటన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బాలు నాయక్, వార్డు సభ్యులు వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారుప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.