9 May, 2026 | 10:42 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

ఇండ్ల ఎంపిక సర్వే షురూ

11-12-2024 12:32 AM
  1. పేదల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరణ
  2. ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్న అధికారులు
  3. ఇందిరమ్మ ఇండ్లపై పేదల ఆశలు

వనపర్తి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వరంలా మారింది. గతంలో జాగా ఉండి ఇల్లు లేదని దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు నేరుగా అధికారులే వెళ్లి ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లో వివరాలను పొందుపరుస్తున్నారు.

తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఇల్లు లేని వారందరూ ఇటీవల ఆయా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుల వారిగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

యాప్‌తో ఎంపికలో పారదర్శకత 

సొంత జాగా కలిగి ఉండి ఇల్లు లేని వారు ఏళ్లుగా గృహాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే మొబైల్ యాప్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ యాప్‌ను ఇటీవలే ప్రారంభించారు.

ఈ యాప్‌లో దరఖా స్తుల దారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీలకు సంబంధించి జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో పంచా యతీ  కార్యదర్శులు, మున్సిపాలిటీల పరిధి లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యే క వార్డు అధికారులు దరఖాస్తులదారుల వివరాలను పొందుపర్చనున్నారు.

డబ్బుల చెల్లింపులు ఇలా 

దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి ప్రస్తుతం ఉంటున్న ఏదేని నివాసం ముందర నిలబెట్టి ఫొటో తీసుకుంటారు. ఉంటున్న నివాసాన్ని, ఖీళ స్థలాన్ని ఫొటో తీసుకుంటారు. ఖాళీ స్థలానికి జియో ట్యా గింగ్ చేస్తారు. కొత్తగా కట్టనున్న ఇంటికి 4 దశల్లో రూ.5 లక్షలను మంజూరు చేస్తారు. ఇది వరకే నిర్మాణం చేపట్టి దరఖాస్తు చేసిన వారికి ఇల్లు మంజూరు ఉండదు.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 14 మండలా లు, 5 మున్సిపాలిటీలు ఉండగా.. 1,42, 075 దరఖాస్తులు ప్రజాపాలన కార్యక్రమం లో వచ్చాయి. కాగా 255 గ్రామ పంచాయతీలకు గాను 255 మంది, 80 మున్సిపల్ వార్డులకు 80 మంది మొత్తం 335 మంది అధికారులు సర్వేను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపుగా 6,000 మంది దరఖాస్తులదారుల వివరాలను యాప్‌లో నమోదు చేసేలా ఈ నెల 7న అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

యాప్‌లో అర్హుల వివరాలు

ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకోసం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల వివరాలను ప్రత్యేకం గా తయారు చేసిన యాప్‌లో పొందుపర్చుతున్నారు. తొలి విడతలో స్వంత స్థలం ఉన్న పేదల కు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది.

మహిళల పేరు మీద ఈ డబ్బులను మంజూరు చేస్తారు. ముందుగా దళితులు, గిరిజనులు, పేద లు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, అనాధలు, ఒం టరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మి కులకు ఇళ్లను కేటాయించనున్నారు. 

పక్కాగా వివరాల నమోదు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తుదారుల నుంచి సేకరించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌లో పక్కాగా నమోదు చేస్తాం. అందుకు తగ్గట్టుగానే అధికారులకు శిక్షణ సైతం ఇచ్చాం. ప్రతి రోజు 6 వేల మంది దరఖాస్తులదారుల వివరాలను సేకరించేలా అధికారులను విధులను నిర్వహిస్తున్నారు. 

 యాదయ్య, జడ్పీ సీఈవో, వనపర్తి