3 June, 2026 | 1:48 AM

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

03-06-2026 12:00 AM

మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకే మొదటి ప్రాధాన్యత

మంత్రి, కలెక్టర్కు టీడబ్లుజేఎఫ్ జిల్లా కమిటీ వినతి

రంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులతో పాటు రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ’ఫ్యూచర్ సిటీ’లో ఇండ్ల జాగాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ మేర కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శా ఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రంగారెడ్డి జి ల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డిలను కలసి కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదు లు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన అభినందనీయమన్నారు. అదే క్ర మంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తు న్న జర్నలిస్టుల వివరాలను కూడా సేకరించి, వారికి కూడా అక్కడ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రిని కోరారు.

ప్రభుత్వ పాలసీ సిద్ధమవుతోంది..

జర్నలిస్టుల వినతిపై రాష్ట్ర ఐటీ శాఖ మం త్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించా రు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పాల సీని తయారు చేస్తోందని ఆయన వెల్లడించా రు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చే ప్రక్రియలో.. మొదట స్థానిక రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు కేటాయించిన తర్వాతే, స్టేట్ లెవెల్ (రాష్ట్రస్థాయి) వారికి ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.

కార్యక్రమం లోసంఘం జిల్లా కోశాధికారి శ్రీనివాస్ చా రి, కార్యదర్శి వర్గ సభ్యులు పి. వెంకటేశ్, శ్రీనివాస్, నర్సింహ్మ, రాజశేఖర్, సత్యనారాయ ణ, జిల్లా కమిటీ సభ్యులు అంజి, యాద య్య, కాంతి, శ్రీశైలం, జిల్లా ప్రచార కార్యదర్శి నర్సింహ్మరెడ్డి, సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ శివ కుమార్ గౌడ్, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు జగన్, రాఘవేందర్ గౌడ్, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.