calender_icon.png 9 December, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి

09-12-2025 07:26:44 PM

ఇంచార్జి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..

వేములవాడ (విజయక్రాంతి): సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పన్ను వసూళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, లక్ష్యానికి తగ్గట్లుగా వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

తడి–పొడి చెత్త సేకరణ, వాహనాల లభ్యత, సెగ్రిగేషన్ విధానం, ట్రేడ్ లైసెన్స్ జారీ, షెట్టర్ల వివరాలు తదితర అంశాలపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటికే ప్రారంభించిన రోడ్లు, మురుగుకాలువలు, జంక్షన్ అభివృద్ధి వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెప్మా పరిధిలో మహిళా సంఘాల పురోగతిపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖాదిర్ పాషా, అన్వేష్, డీటీసీపీఓ అన్సార్, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.