09-12-2025 07:30:09 PM
విద్యార్థిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ సతీష్
ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి సిద్ధార్థ అభిమన్యు రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో అత్యంత ప్రతిభను కనబరిచి వెండి పతకం సాధించాడు. ఈనెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో జరిగిన 2వ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన సిద్ధార్థ అభిమన్యును, కరాటే మాస్టర్ బిడారి మధుకర్ ను పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ అభినందించడం జరిగింది.
శ్రీ చైతన్య మోడల్ స్కూల్ విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా శిక్షణ ఇస్తుందని సతీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు రాజేష్, సమత, వనజ, ఆండాళ్, రజిత, కళ్యాణి, సంధ్య, మల్లీశ్వరి, రజిత, అంజలి, మంజు భార్గవి, నవ్య, అనూష, సాహితి, శిరీష, కార్తిక, స్వప్న, సువర్ణ, శిరీష, మానస, అనిత పిల్లలు పాల్గొన్నారు.