15 March, 2026 | 3:24 AM

ఘనంగా పారడైజ్ పవర్ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే

15-03-2026 01:56 AM

ఆకట్టుకున్న వేడుకలు 

కరీంనగర్, మార్చి 14(విజయక్రాంతి): కరీంనగర్ కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల (సీబీఎస్‌ఈ) వేదికగా పారడైజ్ పవర్ కిడ్స్ విద్యార్థుల గ్రాడ్యు యేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సెయింట్ జార్జ్- సీబీఎస్‌ఈ,ప్యారడైజ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పీ ఫాతిమారెడ్డి  మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడినటువంటి చదువు అందిస్తు న్నారని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలని మొబైల్స్‌కు దూరంగా ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ప్రధానం చేసినట్లు ఇంచార్జ్ సంధ్య తెలిపారు.