15 March, 2026 | 3:24 AM

అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు మృతి

15-03-2026 01:57 AM

అదృశ్యమైన తొమ్మిది రోజులకు చెరువులో విగత జీవులుగా లభ్యం

కామారెడ్డిలో విషాదం

కామారెడ్డి, మార్చి 14 (విజయక్రాంతి): కామారెడ్డిలో తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు శనివారం చెరు వులో విగత జీవులుగా లభ్యమయ్యారు. కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన పానేటి శారద కుమారుడు సింహాద్రి అలియాస్ నరసింహ (10), అదే కాలానికి చెందిన పానేటి శారద అన్న కుమారుడు కోదండమ్ విజ య్ (9) వరుసకు బావ బామ్మర్దులు.

ఈ నెల 6న ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరి గి రాలేదు. ఈ నెల 7న కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యా దు చేశారు. శనివారం రాత్రి రాజీవ్ నగర్ కాలనీలోని చెరువు గుంతలో మృతదేహాలు లభించాయి. పిల్లలు స్నానానికి వెళ్లా రా లేక ఎవరైనా తీసుకెళ్లి తోసి చంపారా అనే కో ణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.