18-10-2025 06:33:56 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో బోదకాలు వ్యాధిపై ఇంటింటా సర్వే నిర్వహించారు. శనివారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ శరత్, డాక్టర్ రమేష్ ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి పలువురికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బోదకాల వ్యాదిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయ, జ్యోతి, ఎఎన్ఎం గ్లోరీ, ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా గౌరవాధ్యక్షులు ఈద లింగయ్య, ఆశ వర్కర్ సుజాత, గ్రామస్తులు పెంచాల రామయ్య, దుర్గం లింగయ్య, ముప్పిడి మహేందర్, లింగంపల్లి బానేష్ లు పాల్గొన్నారు.