12 March, 2026 | 12:14 AM

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

27-02-2026 03:37 PM

సర్పంచ్ పంద్రం సురేశ్

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వాంకిడి మండలం సోనాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సురేశ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ సమాఖ్య సంఘ భవన నిర్మాణం పనులకు ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విద్యా శ్రీ,, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.