18-10-2025 06:35:46 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ప్రతిష్టాత్మక అత్యుత్తమ ఉపాధ్యాయుని అవార్డు స్వీకరించిన సందర్భంగా "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు & గోపాలరావుపేట తాజా మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నా వెంకటరామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రెహమాన్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సిరిపురం నాగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.