18-10-2025 06:30:46 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కుందారపు మహేశ్వర్ జన్మదిన వేడుకలు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ నేతృత్వంలో నిర్వహించగా, వివిధ శాఖల ఉద్యోగులు, నాయకులు పాల్గొని ఆర్డీవో మహేశ్వర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సరస్వతి, సబిత, నరేందర్, సుధాకర్, టీఎన్జీవో జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, టీజీవో జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, ఇరమల్ల శారద, బారి శ్రీనివాస్, రాజేశ్వరరావు, జగన్ గౌడ్, గిరిధర్ రావు, జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.