8 June, 2026 | 10:07 PM

Breaking News

ప్రసాద్ ఆశయాలను కొనసాగించాలి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య   •   డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచన   •   ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు సహించబోము   •   మంథనిలో ప్రశాంతంగా ముగిసిన గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు   •   ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •  

చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం

08-06-2026 08:47 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన కేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున చింతకుంటలో నార్మ్ శాస్త్రవేత్తలు, హైద్రాబాద్ మరియు కెవికె జమ్మికుంట శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ కొత్తపల్లి మండలం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కెవికె జమ్మికుంట ప్రధాన శాస్త్రవేత్త ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... అధిక యూరియా వాడడం వలన కలిగే నష్టాలను గురించి వివరించారు.

అలాగే  పంట అవశేషాలు కాల్చవద్దని సూచిస్తూ, దానికి బదులుగా వేస్ట్ డీకంపోజర్ వాడి పంట అవశేషాలు కలియ దున్ని సేంద్రియ కర్బనాన్ని పెంపొందించి  నేలను సంరక్షించుకోవాలి కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించే ఎనిమిది సన్నపు వరి వంగడాలను పండించే యాజమాన్యాలు చర్యలను చేపట్టే జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా తెలంగాణ సోనా అంటే ఆర్ ఎన్ ర్ 15048 వంగడాన్ని వేయదలచిన రైతులు జూలై 15 తర్వాతే నారు పోసుకోవాలి అని, మోతాదుకు 30 శాతం తగ్గించి యూరియా వాడాలని సూచించారు. నాట్లు వేసేటప్పుడు దగ్గరగా నాట్లు వేసుకోవాలని తెలియజేశారు. 

తదుపరి తర్వాత నార్మ, హైద్రాబాద్ ప్రధాన శాస్త్రవేత్తలు డా.ఎన్.శ్రీనివాస్ రావు, డా.యామిని, డా. రేష్మ  మట్లాడుతూ  పోర్టబుల్ సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా మట్టి పరీక్షలు రైతులు తమ పొలం వద్దనే ఏరకంగా చేసుకోవాలో చూపించారు. తర్వాత పది మంది  రైతులకు  వరి మినీ కిట్స్ డిఆర్ఆర్ 60 అనే రకాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి కోట సంతోష్ కుమార్, ఎఈఓ ఫజిల్, ఎఫ్ పిఓ ఛైర్మెన్,సభ్యులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.